Header Banner

ఈ వారం ఓటీటీల్లో దబిడి దిబిడే.. స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు.!

  Wed May 28, 2025 17:23        Entertainment

థియేటర్లలో విడుదలైన సినిమాలు ఒక నెలకి అటు ఇటుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడం కామన్ గా జరుగుతూనే ఉంది. అయితే ఈ వారం మాత్రం ఈ విషయంలో కాస్త ప్రత్యేకత ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వారం ఓటీటీకి వస్తున్న సినిమాలన్నీ, థియేటర్ల దగ్గర సందడి చేసినవే కావడం విశేషం. దక్షిణాదికి సంబంధించి ఒక్కో వైపు నుంచి ఒక్కో సినిమా రావడం మరో విశేషం. నాని హీరోగా ఇటీవల థియేటర్లకు వచ్చిన సినిమా 'హిట్ 3'. ఆయన సొంత బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 1వ తేదీన థియేటర్లకు వచ్చింది.

 

ఇది కూడా చదవండి: సుప్రీం కోర్టును ఆశ్రయించిన మంచు విష్ణు… వారికి నోటీసులు కూడా అందాయి!

 

ఈ నెల 29వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇదే ఓటీటీలో 31వ తేదీన 'రెట్రో' పలకరించనుంది. సూర్య సొంత బ్యానర్లో నిర్మితమైన సినిమా ఇది. సూర్య - పూజ హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా, ఈ నెల 1న థియేటర్లకు వచ్చింది. కార్తీక్  సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీ, థియేటర్స్ నుంచి మంచి వసూళ్లనే రాబట్టింది. మలయాళంలో మోహన్ లాల్ చేసిన 'తుడరుం' అక్కడ రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. శోభన కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 30 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక కన్నడలో హిట్ కొట్టిన 'అజ్ఞాతవాసి' ఈ నెల 28 నుంచి 'జీ 5'లో అందుబాటులోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!

 

లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన‌ ఎమ్మెల్యే!

 

ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!

 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?

 

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?

 

ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్‌ 60 స్టైలస్‌.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..

 

టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..

 

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #OTT #NewMovies #Content #Release #Summer